విజయమ్మ మరో లేఖ: జగన్ ఎమ్మెల్యేల ఎదురుదాడే

సోమవారం ఉదయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కండువాలు ధరించి వారు శాసనసభకు హాజరయ్యారు. అయితే, తమ పాత సీట్లలోనే వారు కూర్చున్నారు. తాము శాసనసభలో ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని, తమపై వేటు వేసే వరకు శాసనసభకు హాజరవుతామని వారు చెప్పారు. తమపై అనర్హత వేటు వేసే విషయంలో స్పకర్ చేస్తున్న జాప్యం వల్లనే వారు ఎదురు దాడికి దిగడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.
తమపై సాధ్యమైనంత త్వరగా వేటు వేసేలా స్పీకర్‌పై మరింత ఒత్తిడి పెంచడమే వారి వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణలోని ఆరు స్థానాలకు, కోవూరు స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించినప్పుడు తమకు చెందిన 17 స్థానాలకు ఎన్నికలు జరిగేలా చూడాలని కోరుతూ వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాశారు. ఏడు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తమపై అనర్హత వేటు వేసేలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాన్ని రచించారని విమర్శిస్తున్న వారు స్పీకర్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. రాష్ట్రంలోని 24 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు వచ్చేలా చూడాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే మరింత దూకుడుగా వారు వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నారు.
ఇదిలా వుంటే, తన నియోజకవర్గం పులివెందులలో తమ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ విజయమ్మ కడప జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications