చంద్రబాబు కిరణ్ మ్యాచ్ ఫిక్సింగ్, బొత్స టార్గెట్: అంబటి
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ మేరకు ఎసిబి నివేదికలు బయట పెడతానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరోక్షంగా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను హెచ్చరిస్తున్నట్లుగా కనిపిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బుధవారం ఆరోపించారు. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని అన్నారు. వారిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న విషయం బొత్స వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయన్నారు. బాబు, కిరణ్ ఇద్దరి టార్గెట్ బొత్సనే అని అన్నారు. తన మద్యం వ్యవహారం బయటపెట్టకుండా ఉండేందుకు వారిద్దరు కుమ్మక్కైన విషయాన్ని బయటపెడతానని బెదిరిస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. సిఎంను మచ్చిక చేసుకునేందుకు బొత్స చౌకబారు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి చీప్ ట్రిక్కులు ప్లే చేయడం సరికాదన్నారు. భూకేటాయింపులపై సమగ్ర విచారణ జరగాలన్నారు. ప్రభుత్వం భూకేటాయింపులపై మరోసారి సభా సంఘం వేస్తే చంద్రబాబు హయాం నుండి వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా సమాచార హక్కు కమిషనర్ల నియామకాలలో చంద్రబాబు లాలూచీ పడ్డారని బొత్స అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత బొత్స మరోసారి మీడియా సమావేశం పెట్టి తాను అలా అనలేదని కేవలం సహకరించారని మాత్రమే చెప్పానని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా చాలా దుమారం రేపాయి. స్వయంగా బొత్సనే బాబు, కిరణ్ కుమ్మక్కయ్యారనే అర్థంలో వ్యాఖ్యానించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంటోంది. బొత్స వ్యాఖ్యలపై టిడిపి నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి
YSR Congress Party spokes person Ambati Rambabu accused that PCC chief Botsa Satyanarayana comments showing that match fixing between CM Kiran Kumar Reddy and TDP chief Nara Chandrababu Naidu.
Story first published: Wednesday, February 15, 2012, 16:06 [IST]