వైయస్ విజయమ్మ, టిడిపి ఎఫెక్ట్: సభా సంఘం రద్దు?

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపుల విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు క్లీన్ చిట్ ఇవ్వడానికే తమ పార్టీకి తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని, సభలోని సంఖ్యా బలానికి అనుగుణంగా సంఘంలో ప్రాతినిధ్యం కల్పించలేదని తెలుగుదేశం నాయకులు విమర్సించారు. ఈ స్థితిలో సభా సంఘాన్ని రద్దు చేసి, ఎమ్మెల్సీలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూ జాయింట్ కమిటీని వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. తమను అడగకుండా సభా సంఘం వేశారని తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శను నాదెండ్ల మనోహర్ ఫ్లోర్ లీడర్ల సమావేశంలో కొట్టిపారేసినట్లు తెలిసింది. సభా సంఘం వేసే ముందు తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్‌ను అడిగానని, కేశవ్ ఇద్దరి పేర్లు చెప్పారని, మిగతా వారి పేర్లు తర్వాత చెబుతానని అన్నారని, కేశవ్ నుంచి పేర్లు రాకపోవడంతో చెప్పినవారి పేర్లతోనే సభా సంఘం వేశానని ఆయన వివరించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications