హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్స, కిరణ్ కుర్చీకోసం కొట్లాడుతూ బాబుపైకి: రేవంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్య కుర్చీ కోసం కొట్లాట జరుగుతోందని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి బుధవారం ఆరోపించారు. కిరణ్‌ను దింపాలని బొత్స, బొత్సను తప్పించేందుకు కిరణ్ ప్రయత్నాలు చేసుకుంటూ వారి గొడవను తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైకి నెడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని కించపర్చాలన్నదే బొత్స ఉద్దేశ్యమన్నారు. సిఎం చేసే తప్పులకు బాబు బాధ్యుడు అవుతారా అని ప్రశ్నించారు. ఒకప్పుడు జాతిపిత మహాత్మా గాంధీని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు ఇప్పుడు బ్రాందీని నమ్ముకుంటోందన్నారు. బ్రాందీ వ్యాపారులను కాంగ్రెసు పార్టీ ఉపయోగించుకుంటోందన్నారు.

గంజాయి వ్యాపారులకు పిసిసి పదవి ఇచ్చేందుకు కాంగ్రెసు పార్టీ వెనుకాడదన్నారు. ఆధిపత్య పోరులో భాగంగానే బొత్స ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. సిండికేట్లతో సంబంధం ఉన్న బొత్స సత్యనారాయణ, ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణలను వెంటనే బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
TDP leader Revanth Reddy accused PCC chief Botsa Satyanarayana that he is trying to remove Kiran Kumar Reddy from CM post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X