అమెరికాతో ఢీకి ఇరాన్ రెడీ, అణుశక్తి ప్రదర్సన

ఈ కొత్త అణ్వాయుధ శక్తి ప్రదర్శించిన నేపథ్యంలోనే ఇరాన్‌ను ఏకాకిని చేయాలని ఒబామా పిలుపునిచ్చారు. కొత్త ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ ఆరు ఐరోపా దేశాలకు చమురు ఎగుమతులను నిలిపేసింది. నెదర్లాండ్స్, గ్రీసు, ఫ్రాన్స్, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ దేశాలకు చమురు ఎగుమతులు నిలిపేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. కాగా, చైనా ఇరాన్‌కు మద్దతు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లు అనిపిస్తోంది.
ఢిల్లీ పేలుళ్లకు ఇరానియన్ కారణం కాదని అహ్మద్ నెజాదీ స్పష్టం చేశారు. భారతీయుడి చేతనే ఆ పేలుడు జరిపించారని ఆయన ఆరోపించారు. పేలుడుకు ముందు డ్రిల్లింగ్ జరిగిందని ఆయన అన్నారు. చమురు సరఫరాను నిలిపేయలేదని ఆయన చెప్పారు. అయితే, నిలిపేస్తామని మాత్రం ఆయన హెచ్చరించారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తమ ఉద్దేశాలను అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేశామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications