చిరు పార్టీ విలీనానికి ఒకె: సిఎల్పీకి జగన్ వర్గ ఎమ్మెల్సీ

కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి సిఎల్పీ సమావేశానికి వచ్చారు. డైరీలో ఆమె పేరు లేకపోయినా వచ్చి సంతకం చేశారు. గత కొద్ది కాలంగా పుల్లా పద్మావతి జగన్‌కు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరంగల్ జిల్లాలో శాసనసభ్యురాలు కొండా సురేఖ దంపతుల పట్ల ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొండా దంపతులతో ఉన్న విభేదాల వల్లనే ఆమె జగన్‌కు దూరమైనట్లు చెబుతున్నారు. కొండా దంపతుల వ్యవహారంపై చెప్పినా కూడా జగన్ పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో తిరిగి కాంగ్రెసులోకి వచ్చేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డైరీలో సంతకం చేసి పుల్లా పద్మావతి చకచకా వెళ్లిపోయారు. కాంగ్రెసులోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తన చర్య ద్వారా సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.