హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్స సత్తిబాబును టార్గెట్ చేసిన కాంగ్రెసు ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో జోడు పదవుల అంశం మరోసారి రాజుకుంటుంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు జోడు పదవులు ఉండటాన్ని కాంగ్రెసు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బొత్స సత్యనారాయణ పిసిసి చీఫ్‌గా ఉండాలి లేదా మంత్రిగా ఉండాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి అన్నారు. కాంగ్రెసులో జోడు పదవులు ఉండకూడదన్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని అన్నారు. ఈ విషయాన్ని తాను అధిష్టానం దృష్టికి తీసుకు వెళతానని చెప్పారు. మంత్రులకు పార్టీ పదవులు ఉండవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. మరో ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మా రెడ్డి కూడా దామోదర రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవించారు.

బొత్సకు జోడు పదవులు ఉండటాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. పదవుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే మాట వాస్తవమేనని అన్నారు. ఏ అధికారాల్లేని ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణకు కట్టబెట్టారన్నారు. కీలక పదవులు అన్నీ ఆంధ్రా వారికే దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రివర్గ ప్రక్షాళణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు అవినీతిరహిత పాలన కోరుకుంటున్నారన్నారు. భవిష్యత్తులో ఎసిబి తరహా విజిలెన్స్ దాడులు ఉంటాయన్నారు. తమ జిల్లా డిసిసి అధ్యక్షుడి పదవిని బిసిలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెసు పార్టీ నేతలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి జోడు పదవుల అంశంపై లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సీమాంధ్రకు చెందిన వారు జోడు పదవులు అనుభవిస్తున్నారని, పదవుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వారు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లనున్నారని తెలుస్తోంది.

English summary
Congress MLAs targetted PCC chief Botsa Satyanarayana today. They opposing two post to him that PCC chief and Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X