హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయమ్మకు షాక్: బాబు ఆస్తులపై పిటిషన్ డిస్మిస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma-Chandrababu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌పై హైకోర్టు గురువారం తుది తీర్పును వెలువరించింది. బాబు ఆస్తులపై వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం డిస్మిస్ చేసింది. పిటిషన్‌కు చట్టబద్దత లేదని, సహజ న్యాయసూత్రాలకు విరుద్దంగా ఉందని హైకోర్టు చెప్పింది. పిటిషన్ విచారణార్హం కాదని అన్నది. కోర్టు తీర్పును నిమిషాల్లో వెలువరించింది.

కాగా వైయస్ విజయమ్మ అక్టోబర్ 17న బాబు ఆస్తులపై హైకోర్టులో కేసు వేశారు. 2,424 పేజీల పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుతో సహా మరో పదమూడు మంది పైన విచారణ జరపాలని ఆమె అందులో కోరారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు తన హయాంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆమె అందులో పేర్కొన్నారు. ఆమె పిటిషన్ పరిగణలోకి తీసుకున్న కోర్టు సిబిఐ, ఈడి, సెబికి విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తమ వాదన వినకుండానే, కనీసం నోటీసులు జారీ చేయకుండానే విచారణ జరపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ రావు, సుజనా చౌదరి, సిఎం రమేష్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం వారికి సూచించింది. దీంతో వారు తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు సహా పలువురు విచారణపై వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా నాట్ బిఫోర్ కారణంగా ఈ కేసు రెండు బెంచీలు మారింది. విచారణ ముగిశాక డిసెంబర్ 14న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచడంతో పాటు విచారణపై స్టే విధించింది. గురువారం తుది తీర్పుకు వచ్చింది.

English summary
High Court dismissed YSR Congress leader YS Vijayamma's petition on TDP chief Nara Chandrababu Naidu's assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X