హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సభలో సైలెంటైన జగన్ వర్గం, కాంగ్రెస్‌తో చెట్టాపట్టాల్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Party Logo
హైదరాబాద్: ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు బడ్జెట్ సమావేశాల్లో మౌనముద్ర వహిస్తున్నారు. సమావేశాలకు ముందు, గవర్నర్ ప్రసంగం రోజు వారు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరించారు. అయితే ఈ రెండు రోజులు వారు ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలు కనిపించడం లేదు. మద్యం సిండికేట్లపై తెలుగుదేశం, తెలంగాణపై భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, కరవు, పోలవరం సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలో నిరసన తెలియజేస్తుంటే వీరు మాత్రం ఏమాత్రం చప్పుడు చేయడం లేదు. నిరసనలకు దూరంగా ఉంటున్నారు. గురువారం నాటికి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై నాలుగు రోజులు. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం వదిలేస్తే మంగళ, బుధవారాలు వారు ఎలాంటి నిరసనలు తెలియజేయలేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కండువాలు వేసుకొని రావడం, స్పీకర్‌కు తమను ప్రత్యేక సభ్యులుగా పరిగణించాలని లేఖ రాయడం మినహా నిరసనలలో పాల్గొనలేదు.

ఈ క్రమంలో బుధవారమే బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న జగన్‌ను, సభ వాయిదా అనంతరం ఆయన వర్గం ఎమ్మెల్యేలు కొందరు కలిశారు. కానీ, జగన్ అనారోగ్యం కారణంగా వారి మధ్య ఎలాంటి నిర్మాణాత్మక చర్చలూ జరగలేదు. దీంతో జగన్ తన వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సోమ లేదా మంగళవారం సమావేశమై సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం ఉంది. కాగా అసెంబ్లీ ఆవరణలో బుధవారం జగన్ వర్గ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తరఫున తొలిసారిగా ఎన్నికైన శాసనసభ్యులు చెట్టపట్టాల్ వేసుకుని తిరగడం గమనార్హం.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy camp mlas maintaing silence in Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X