సోనియా కాళ్లు పట్టుకుంటాడు!: బాబుపై లక్ష్మీ పార్వతి
State
oi-Srinivas
By Srinivas
|
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవసరమైతే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కాళ్లు కూడా పట్టుకుంటారని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి గురువారం ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో అన్నారు. కోర్టు తీర్పుతో తాను నీతివంతుడనని చంద్రబాబు చెబుతున్నారని, ఆయన ఏ తప్పు చేయలేదని హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. ప్రజలు వ్యతిరేకించారు కాబట్టే రెండుసార్లు ఆయన ఓడిపోయారన్నారు. కోర్టుల ద్వారా కొందరు దోపిడీదారులు, హంతకులు, స్మగ్లర్లు ఎలా బయటపడుతున్నారో చంద్రబాబు కూడా అలాగే బయటపడ్డారన్నారు. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు పూర్తిగా తెలుసునన్నారు. చంద్రబాబుకు విలువలు లేవన్నారు. ఆయన తన హయాంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
బాబు తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు విచారణ జరపకుండానే కేసుల నుండి బయటపడుతున్నారన్నారు. అలాంటి వ్యక్తి నీతివంతుడా అని ప్రశ్నించారు. దొంగలా ఎన్నాళ్లు తప్పించుకుంటారు అన్నారు. తాను కాంగ్రెసు పార్టీకి వత్తాసు పలకడం లేదని, తన పార్టీ తరఫున మాట్లాడుతున్నానని అన్నారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు పలుకుతున్నానని అన్నారు.