హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇకనైనా ఆపాలి, విజయమ్మ క్షమాపణ చెప్పాలి: టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mothukupally Narasimhulu-Devineni Umamaheswara Rao
హైదరాబాద్: తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంపై తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం స్పందించారు. బాబు ఆస్తులపై పిటిషన్ వేసిన వైయస్ విజయమ్మ వెంటనే క్షమాపణ చెప్పాలని మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఉద్దేశ్య పూర్వకంగా సిగ్గు లేకుండా పిటిషన్ వేయించారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన పాలన వల్ల ఇప్పుడు అధికారులు జైళ్లలో ఏడుస్తున్నారన్నారు. బాబు ఎలాంటి తప్పు చేయలేదని రుజువైందన్నారు. న్యాయమే గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వందల కొట్లకు పడగలెత్తింది అవినీతితోనేనని, ఆయనకు బాబును విమర్శించే అర్హత లేదన్నారు.

విజయమ్మ కేసు వేసినప్పుడు చంద్రబాబు బాధపడలేదని, ఇప్పుడు సంతోషపడటం లేదని పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇలాండి ఒడిదుడుకులు ఉంటాయని ఆయనకు తెలుసునన్నారు. తీర్పు ద్వారా బాబుపై వచ్చినవన్నీ తప్పుడు ఆరోపణలు అని తేలిపోయిందన్నారు. ఈ తీర్పు చారిత్రాత్మకం అన్నారు. జగన్ ఆస్తులు, వైయస్ అక్రమాలు త్వరలో కోర్టుకు తేలనున్నాయన్నారు. అవినీతిపరులు కోర్టుకు రాక తప్పదన్నారు. హైకోర్టు తీర్పు జగన్ పార్టీకి ఎదురు దెబ్బ అని దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఆ పార్టీ నేతలు ఇకనైనా బాబుపై విమర్శలు ఆపాలన్నారు. విజయమ్మ దురుద్దేశ్యంతోనే పిటిషన్ వేశారని రావుల చంద్రశేఖర రెడ్డి ఆరోపించారు. జగన్ ఆస్తులను పేదలకు పంచిపెట్టాలని, విజయమ్మ క్షమాపణ చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. బురదజల్లేందుకు పిటిషన్ వేశారని మరోనేత యనమల రామకృష్ణుడు అన్నారు. కాగా టిడిపి నేతలు బాబుకు మిఠాయి తినిపించారు.

English summary
TDP leaders demanded for YS Vijayamma apology to their party chief Nara Chandrababu Naidu with dismission of petition in High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X