హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకే కోర్టు రెండు తీర్పులా?: హైకోర్టు తీర్పుపై జగన్ పార్టీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sobha Nagi Reddy-Vasireddy Padma
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వేసిన పిటిషన్ డిస్మిస్ పైన ఆ పార్టీ నేతలు గురువారం స్పందించారు. ఈ తీర్పును తాము ముందే ఊహించామని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. తమకు రాష్ట్రంలో ఎలాగు న్యాయం జరగదని తెలిసే గతంలోనే సుప్రీం కోర్టును ఆశ్రయించామని చెప్పారు. హైకోర్టు తీర్పుపై తాము సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని ఆమె చెప్పారు. ఒకే హైకోర్టులో రెండు విభిన్న తీర్పులు ఎలా వస్తాయని ఆమె ప్రశ్నించారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. మాజీ మంత్రి శంకర రావు లేఖను ఇదే హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిందని, మరి విజయమ్మ పిటిషన్ ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు. సంతకం లేని శంకర రావు పిటిషన్ స్వీకరించి, రెండువేలపై చిలుకు ఆధారాలు చూపిస్తే ఎందుకు కొట్టివేసిందన్నారు.

చంద్రబాబు నాట్ బిఫోర్ అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మరో నేత కెకె మహేందర్ రెడ్డి అన్నారు. బాబు న్యాయవ్యవస్థను కించపరుస్తున్నారని ఆరోపించారు. నాట్ బిఫోర్‌తో న్యాయస్థానంలోనూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఒకే హైకోర్టులో రెండు తీర్పులు ఎలా వస్తాయని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పిటిషన్ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. చంద్రబాబు తప్పు చేయనప్పుడు స్టే ఎందుకు తెచ్చుకున్నారని మరో నేత శోభా నాగి రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుతో చంద్రబాబు ఏ తప్పు చేయలేదని టిడిపి నేతలు ప్రచారం చేయడం సరికాదన్నారు.

English summary
YSR Congress leaders said they will go to Supreme Court on High Court justice about Chandrababu Naidu assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X