హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎసిబి దాడులకు కౌంటర్ అటాక్‌కు వైన్ డీలర్లు రెడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) దాడులకు వైన్ డీలర్లు కౌంటర్ అటాక్ మొదలు పెడుతున్నారు. వైన్ షాపు లైసెన్స్‌లు తిరిగి ప్రభుత్వానికి సరెండ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిలో తాము వ్యాపారం చేయలేమని, అందువల్ల లైసెన్సులను సరెండర్ చేస్తామని, ఐదు నెలల లైసెన్సు ఫీజు తమకు ఇవ్వాలని వారు ప్రభుత్వానికి చెప్పనున్నారు. రేపు శుక్రవారం ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రావు చెప్పారు.

ప్రభుత్వం, ఎసిబి తమను వేధిస్తోందని, తమను నేరస్థులుగా చిత్రీకరిస్తున్నారని వైన్ డీలర్లు అంటున్నారు. తమను వేధిస్తున్నందున వ్యాపారం చేయలేమని వెంకటేశ్వర రావు అన్నారు. ఇది ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ఏమీ కాదని ఆయన అన్నారు. తాము ఎవరికీ తమంత తాముగా ముడుపులు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. తమను బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో ముడుపులు ఇవ్వాల్సి వస్తోందని ఆయన అన్నారు.

English summary
Wine dealers have decided to surrender licences to government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X