గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!!
వంట గ్యాస్ కొరత సమస్యగా మారింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా పైన ఆంక్షలు పలు రంగాల పైన ప్రభావం చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల గ్యాస్ కొరత కారణంగా.. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. వినియోగదారులు బుక్ చేయకుండానే వారి ఫోన్లకు సందేశాలు వస్తున్నాయి. కమర్షియల్ కొరత వేళ డొమెస్టిక్ సిలిండర్ దారి మళ్లుతున్నాయి. హోటల్స్.. హాస్టల్స్.. ఆలయాల పైన గ్యాస్ కొరత ప్రభావం కనిపిస్తోంది. ఇక.. వంట గ్యాస్ సిలిండర్ దక్కాలంటే... బుకింగ్ కోసం ఏజన్సీలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వంట గ్యాస్ కష్టాలు పెరుగుతున్నాయి. వంటగ్యాస్ అందరికీ సమానంగా పంపిణీ జరిగే లక్ష్యంతో ఎల్పీజీ సిలిండర్ కనీస వెయిటింగ్ కాలాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు ప్రభుత్వం పెంచింది. గ్రామాల్లో35 రోజులకు పెంచారు. అదే విధంగా రెండు సిలిండర్లు ఉన్న వారికైతే లాక్ ఇన్ పీరియడ్‌ను 30 రోజులకు పెంచింది. ప్రపంచ ముడి చమురు బ్యారెల్ ధర 130 డాలర్లు దాటేంతవరకు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉంటాయని వర్గాలు చెప్పాయి. ఈ పరిస్థితుల్లో గ్యాస్ బుకింగ్ కోసం ఆన్ లైన్ విధానం క్రాష్ అవుతోంది.

దీంతో.. బుకింగ్ కోసం వినియోగ దారులు ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొందరు వినియోగదారులు బుకింగ్ చేయకుండానే ఫోన్లకు సందేశాలు వస్తున్నాయి. ప్రభుత్వం వంట గ్యాస్ నిల్వలకు ఇబ్బంది లేదని చెబుతున్నా... సమస్య కొనసాగుతూనే ఉంది. ఇదే అదనుగా బ్లాక్ మార్కెటింగ్ చేసే వారు రంగంలోకి దిగారు. వీరి పైన ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది.
గ్యాస్ ఏజెన్సీల వద్దకు వినియోగ దారుల పరుగులు
ఇంటి అవసరాల కోసం గ్యాస్ వినియోగదారులకూ ఇబ్బందులు తప్పడం లేదు. డొమెస్టిక్ వినియోగ దారులకు ఇబ్బంది లేదని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. పలు ప్రాంతాల్లో సిలిండర్ బుకింగ్ కోసం తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు. ఆన్ లైన్ విధానంలో బుకింగ్ మార్గాలు కొన్ని పని చేయడం లేదు. దీంతో వినియోగదారులు నేరుగా ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఒక్కసారిగా రద్దీ పెరగడం, బుకింగ్ సిస్టమ్ నెమ్మదించడం వల్ల సమస్య ఏర్పడిందని ఏజెన్సీల నిర్వాహకులు తెలుపుతున్నారు.

ఇప్పటి వరకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ సాధారణ రోజుల్లో బుక్ చేస్తే ఒకటి, రెండు రోజుల్లో సిలిండర్ వస్తుంది. కానీ ఇప్పుడు వారంపైగా పడుతోందని వినియోగదారులు చెబుతున్నారు. వాణిజ్య కేటగిరి సరఫరా ఆగిపోవడంతో డొమెస్టిక్ సిలిండర్లను టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, హాస్టళ్ల నిర్వాహకులు బ్లాక్ లో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. యుద్దం కొనసాగితే.. వంట గ్యాస్ కష్టాలు మరింత ఖాయమనే వాదన వినిపిస్తోంది.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
దేశంలో పెట్రోల్, గ్యాస్ స్టాక్.. రెండు నెలలే -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
భారత్‌లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
LPG పై కేంద్రం మరో గుడ్ న్యూస్ -రాష్ట్రాలకు లేఖలు..! -
గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై ఏపీ వాసులకు సూపర్ న్యూస్.. మీకు దిగులు లేదు! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications