మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ!

తెలంగాణ రాష్ట్రంలో ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు స్వల్ప ఉపశమనం లభిస్తుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 15, 16 తేదీలలో రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షం కురుస్తుందని imd పేర్కొంది. ఏప్రిల్ 23 వరకు అనేక జిల్లాలలో వాతావరణం కాస్త చల్లగా అక్కడక్కడ వర్షాలు కురుస్తూ ఉండే అవకాశం ఉందని imd వెల్లడించింది.

తెలంగాణాలో మరో రెండు రోజుల్లో వర్షాలు

భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులలో వర్షాలు కురవనున్నాయి అని, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో దీని ప్రభావం అధికంగా ఉంటుందని, కొన్ని ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

IMD Forecast Rains in these districts Likely on March 15 16 Relief from this summer Heat Expected

ఏప్రిల్ 14వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండి హెచ్చరికలు

పెరుగుతున్న సగటు ఉష్ణోగ్రతలు, తేమశాతం ఈ వాతావరణ మార్పులకు కారణమని imd స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ ప్రభావం హైదరాబాద్ సహా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మహబూబాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. వర్షాలు కురిసే వరకు ఎండల ప్రభావం ఎక్కువగానే ఉంటుందని, ఏప్రిల్ 14వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది.

రైతులకు ఐఎండీ హెచ్చరిక

ఐఎండి హెచ్చరికలతో అకాల వర్షాలు కురుస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ముఖ్యంగా వర్షాలు కురిసే వరకు ఎండల విషయంలో జాగ్రత్తగా ఉండాలని imd హెచ్చరిస్తోంది. భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి.

ఇప్పటికే ముదిరిన ఎండలు.. ముందు ముందు ఉగ్రరూపం

నల్గొండ, కరీంనగర్, ఖమ్మం వంటి ప్రాంతాలలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రెండు రోజులలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ ఆ తర్వాత ఎండలు మరింత తీవ్ర రూపం దాలుస్తాయి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ సారి ఎండలు బాగా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+