వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొండను ఢీకొని కూలిన మానవ రహిత హెలికాప్టర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: మానవ రహిత విమానం ఒకటి విశాఖపట్నంలో కొండను ఢీకొని కుప్పకూలింది. నేవీకి చెందిన నెం.901 విమానం గాజువాక వద్ద ఓ కొండను ఢీకొంది. గాలిలో మూడుసార్లు చక్కర్లు కొట్టి నాలుగోసారి ఇది కూలింది. ఈ ఘటన గాజువాక సమీపంలోని గణపతి నగర్ సమీపంలో జరిగింది. పైలట్ రహిత విమానం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కొండకు పై భాగంలో ఢీకొనడంతో కాలనీలో ఎలాంటి నష్టం జరగలేదు.

విమానం ఒక్కసారిగా కూలిన శబ్ధం రావడంతో గాజువాక వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారు భయాందోళనకు గురయ్యారు. నేవీ అధికారులు ఘటనా ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. కాగా పైలెట్ రహిత విమానం కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అయితే ఇలాంటి ప్రయోగాలు జనావాస ప్రాంతాలలో చేయవద్దని స్థానికులు కోరుతున్నారు. అది కొండ పైన తాకింది కాబట్టి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అదే కింద జరిగితే భారీ ప్రాణ నష్టం జరిగేదని అంటున్నారు.

English summary
A helicopter crashed in Vishakapatnam district today. Non-pilot helicopter hitted a hill at Gajuwaka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X