హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉప ఎన్నికల బరిలో బిజెపి: తెలుగుదేశంలో ఆశలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu-Kishan Reddy
హైదరాబాద్: ఉప ఎన్నికలలో కొన్ని స్థానాలలో తాము కూడా పోటీ చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రకటించడంతో తెలుగు దేశం పార్టీలో ఉత్సాహం కనిపిస్తోందనే చెప్పవచ్చు. బిజెపి నేత లక్ష్మణ్ ఆదివారం తాము మహబూబ్ నగర్ నియోజకవర్గంలో తాము బరిలోకి దిగుతామని, రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఆరు నియోజకవర్గాల్లోని మరో మూడు నియోజకవర్గాల్లో కూడా తాము పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. బిజెపి నేతల నిర్ణయం తెలంగాణ రాష్ట్ర సమితిని షాక్‌కు గురి చేసేది కాగా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశం. బిజెపి మహబూబ్ నగర్‌తో పాటు మరో రెండు మూడు నియోజకవర్గాల్లో పోటీకి దిగితే తెలంగాణవాదులు ఓట్లు చీలి తమకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. మహబూబ్ నగర్, కామారెడ్డి, స్టేషన్ ఘనపూర్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఏ మూడు నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్థులను నిలిపినా సీటు గెలుపొందవచ్చుననే ఆశ తెలుగుదేశం పార్టీలో కనిపిస్తోంది.

ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా లేక ఎవరికైనా మద్దతివ్వాలా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోనప్పటికీ తెలంగాణకు పూర్తిగా అనుకూలంగా ఉన్న సిపిఐ కూడా మహబూబ్ నగర్‌లో బిజెపి, టిఆర్ఎస్ ఇరుపార్టీలు అభ్యర్థులను నిలబెట్టడాన్ని తప్పు పట్టడం లేదు. ఇటీవలి కాలంలో టిఆర్ఎస్‌కు ధీటుగా బిజెపి తెలంగాణవాదం వినిపిస్తోంది. జనవరి 19 నుండి ఫిబ్రవరి 9వ తేది వరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ నినాదంతో పది జిల్లాలు చుట్టి వచ్చారు. అప్పుడే తెలంగాణలో బిజెపి పేరు బాగా నానింది. దానిని ఇప్పుడు క్యాష్ చేసుకోవాలని బిజెపి తాపత్రయపడుతోంది. ఇందులో భాగంగానే ఉప ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకుంది. అయితే బిజెపి తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం తెలంగాణ ఓట్లు చీలి తమకు లబ్ధి చేకూరుతుందని టిడిపి బాగా ఆశలు పెట్టుకుంది.

English summary
Telugudesam Party is very confident on winning in byelection with BJP contest announcement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X