వైయస్ ఏమయ్యారో చూశారు, వీరూ అంతే: బాబు

శాసనసభ సమావేశాలు జరగకపోతే బాగుంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నారని ఆయన అన్నారు. సమావేశాలను నడపాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని ఆయన అన్నారు. రేపటి నుంచైనా అసెంబ్లీని సక్రమంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అది జరగకపోతే ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి తాము ఏం చేయాలో అది చేస్తామని ఆయన అన్నారు. ప్రజల ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని ఆయన అన్నారు. ప్రజా సమస్యలు శాసనసభలో చర్చకు రాకుండా చూస్తున్నారని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని సంపదను దోచుకోవడంపై చూపుతున్న ఉత్సాహం అసెంబ్లీని నడిపించడంలో, ప్రజాసమస్యలను పరిష్కరించడంలో చూపడం లేదని ఆయన అన్నారు. అధికారం కోసం కాంగ్రెసు నాయకులు పనిచేస్తున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేయడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెసు అధికార దుర్వినియోగం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతి కార్యక్రమాలు నిర్ధారణ అవుతాయని ఆయన అన్నారు. అభివృద్ధి పథకాల్లో అవినీతి విచ్చలవిడిగా కొనసాగుతుందని, విచారణ జరిపితే సగం మంది జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు.