హరీష్ రావును అటెండర్‌గా కూడా పెట్టుకోరు: ఎర్రబెల్లి

తెలంగాణ ప్రజలకు టిఆర్ఎస్ పైన నమ్మకం పోయిందన్నారు. తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గతంలోనే కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీకి, చిదంబరానికి లేఖ రాశారన్నారు. మళ్లీ రాయాల్సిన అవసరమేముందన్నారు. టిఆర్ఎస్ నిత్యం బాబు లేఖ ఇవ్వాలని విమర్శించడం తప్పితే ఏమీ చేయలేకపోతుందన్నారు. చిత్తశుద్ధి ఉండే ఎన్నికలను బహిష్కరించాలన్నారు. కెసిఆర్‌కు డబ్బు సంపాదన, రాజకీయ లబ్ధి తప్ప తెలంగాణ అవసరం లేదన్నారు. తెలంగాణపై చంద్రబాబు వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామన్నారు. పోలవరం టెండర్ల కోసం కెసిఆర్ అమ్ముడుపోయారన్నారు. తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డి తమ మద్దతు కోరితే ఆలోచిస్తామన్నారు. నాగం రాజీనామా వెనుక తెలంగాణ ఆకాంక్ష ఉందా లేక జగన్ ఉన్నారా తెలియాల్సి ఉందన్నారు. సభ సజావుగా జరగకుండా స్పీకర్ పరోక్షంగా ప్రభుత్వానికి సహకరిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications