హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కమిషనర్ల ఫైల్ తిరస్కరణ: ప్రభుత్వానికి గవర్నర్ ఝలక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narasimhan
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం ఝలక్ ఇచ్చారు. సమాచార హక్కు కమిషనర్ల నియామక ఫైలును నరసింహన్ తిప్పి పంపారు. అనుభవం లేని వారిని కమిషనర్లుగా నియమించారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కమిషనర్ల నియామకాన్ని పున పరిశీలించాలని రాజ్ భవన్ ప్రభుత్వానికి సూచించింది. రాజకీయ నాయకులను సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా నియమించారని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులను కమిషనర్లుగా నియమించడాన్ని గవర్నర్ తప్పు పట్టారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎనిమిది మందితో కూడిన ఫైల్‌ను పంపించింది. అందులో నలుగురు పేర్లను గవర్నర్ తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. అయితే తిరస్కరింపబడిన నలుగురు ఎవరు, ఆమోదింపబడిన నలుగురు ఎవరనే విషయం ఖచ్చితంగా తెలియరాలేదు.

కమిషనర్ల నియామకంలో అవకతవకలు ఉన్నాయని, రాజకీయ నాయకులకు అందులో చోటు కల్పించారని ఆరోపణలు వచ్చాయి. ఇది తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో అధిష్టానం నుండి అందిన సూచనల మేరకే గవర్నర్ ఈ ఫైలును తిరస్కరించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మాట్లాడుతూ.. కమిషనర్లుగా నియమించిన ఫైలును పరిశీలిస్తున్నామని, వివరణ కోరామని చెప్పారు. ఆ తర్వాత గవర్నర్ కూడా తన వద్దకు పైల్ ఇంకా రాలేదని, వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకే సచివాలయానికి ఫైల్‌ను తిప్పి పంపారని అంటున్నారు. కాగా ఇంతియాజ్ అహ్మద్, విజయ నిర్మల, కోనేరు తాంతియా కుమారి పేర్లను తిరస్కరించినట్లుగా సమాచారం.

English summary
Governor Narasimhan gave shock to Congress government on right to information commissioners issue. Governor was returned commissioners file to secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X