హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసును బొంద పెడదాం: టిడిపికి హరీష్ సూచన

By Pratap
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: తాను తెలంగాణకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరానికి నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇస్తే తెలుగుదేశం పార్టీతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసును బొందపెడదామని ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకు సూచించారు. తెలంగాణపై రాష్ట్రంలోని నాలుగు పార్టీలు స్పష్టమైన వైఖరి చెప్పలేదని, ఆ పార్టీలు చెప్పే వరకు తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం గానీ నిర్ణయం తీసుకోవడం గానీ సాధ్యం కాదని చిదంబరం చెప్పారని, ఆ నాలుగు పార్టీల్లో తెలుగుదేశం కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే ఉప ఎన్నికల్లో తాము పోటీ నుంచి తప్పుకుంటామని, తెలుగుదేశం పార్టీతో కలిసి కాంగ్రెసును బొంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.

తెలుగుదేశం తెలంగాణ నాయకులు సొల్లు పురాణం వినిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభలో తెలంగాణ తీర్మానం ప్రతిపాదించాలంటే అధికార కాంగ్రెసు ముందుకు రావడం లేదని, తెలుగుదేశం పార్టీ తమకు మద్దతు ఇవ్వడం లేదని, రెండు పక్షాలు కుమ్మక్కయి తెలంగాణ తీర్మానం రాకుండా చూస్తూ సభను వాయిదా వేసుకుని పారిపోతున్నాయని ఆయన అన్నారు. ఇప్పుడే తీర్మానం పెట్టాలని తాము అడగడం లేదని, శానససభ సమావేశాలు ముగిసే లోగా తీర్మానం పెడతామని తేదీ ఇవ్వాలని అడుగుతున్నామని ఆయన అన్నారు. తెంలగాణ తీర్మానం ప్రవేశపెట్టే వరకు పట్టుబడుతామని ఆయన చెప్పారు.

ఉప ఎన్నికలు బహిష్కరించాలని తెలుగుదేశం తెలంగాణ నాయకులు చేస్తున్న సూచనను ఆయన వ్యతిరేకించారు. ఉప ఎన్నికలను బహిష్కరిస్తే తెలంగాణ రాదని, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను బహిష్కరిస్తే, ఉప ఎన్నికల్లో ఆ పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేస్తే తెలంగాణకు దగ్గరవుతామని, సోనియా చంద్రబాబు కళ్లు తెరుస్తారని ఆయన అన్నారు. ఎన్నికలను ఎదుర్కోలేకనే బహిష్కరించాలని తెలుగుదేశం నాయకులు సూచిస్తున్నారని ఆయన అన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే ఖర్మ తమ పార్టీకి పట్టలేదని, కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు ఆ ఖర్మ పట్టిందని ఆయన అన్నారు. తమ పార్టీ లక్ష్యమే తెలంగాణ రాష్ట్ర సాధన అని ఆయన అన్నారు. రాజకీయమూ అధికారమూ ఆశించి పనిచేయడం లేదని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తున్నామని ఆయన అన్నారు.

English summary
TRS MLA Harish Rao demanded TDP to submit letter to Chidambaram supporting Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X