హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రభుత్వం వీధిరౌడీలా ప్రవర్తిస్తోంది: జెపి మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
హైదరాబాద్: ధాన్యం ఎగుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వీధిరౌడీలా వ్యవహరిస్తోందని లోకసత్తా శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. పౌర సరఫరాల మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ తర్వాత ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ధాన్యం ఎగుమతులపై ఆంక్షలు విధించి రైతులను నష్టపరుస్తోందని ఆయన అన్నారు. పరిమితమైన మేరకు పప్పు ధాన్యాలను, బియ్యాన్ని, వరి ధాన్యాన్ని ఎగుమతి చేసే విషయంపై ఆంక్షలు పెట్టవచ్చునని కేంద్ర సూచిస్తే రాష్ట్రట ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు చట్టవిరుద్ధమని ఆయన అన్నారు.

రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ధాన్యం సరఫరాను ఆపడానికి వీలు లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, అయితే మొత్తంగానే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిషేధించిందని ఆయన చెప్పారు. ధాన్యం దిగుబడి ఖర్చులు పెరిగి అమ్మకం ధరలు తగ్గాయని ప్రభుత్వాలే అంగీకరిస్తున్నాయని, అయినా రైతులు స్వేచ్ఛగా ధాన్యాన్ని అమ్ముకునే వీలు కల్పించడం లేదని ఆయన అన్నారు. కర్ణాటకలో కన్నా మన రాష్ట్ర రైతులకు తక్కువ ధరలు వస్తున్నాయని, కనీస మద్దతు ధర కూడా రైతులకు లభించడం లేనది ఆయన అన్నారు.

English summary
Loksatta president and MLA Jayaprakash Narayana lashed out at state government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X