కెసిఆర్‌కు ఊరట: పోటీపై వెనక్కి తగ్గిన బిజెపి

బిజెపి మహబూబ్ నగర్, కోవూరులతో పాటు స్టేషన్ ఘనపూర్, కామారెడ్డి స్థానాల నుంచి కూడా పోటీకి దిగాలని యోచించింది. నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆయనకు తెరాస కూడా మద్దతు ఇవ్వబోతోంది. అయితే, తెరాస విజ్ఞప్తులతో, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ దౌత్యంతో బిజెపి నాయకత్వం దిగి వచ్చినట్లు చెబుతున్నారు.
రాజీనామాలు చేసిన స్థానాల్లో ఆయా అభ్యర్థులే పోటీ చేస్తారని కోదండరామ్ మంగళవారం చెప్పారు. దానిపై ఎటువంటి సందేహాలు అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశానంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ స్థానం విషయంలో మాత్రం బిజెపి, తెరాస తేల్చుకుంటాయని ఆయన అన్నారు. ప్రస్తుత స్థితిలో మహబూబ్ నగర్ సీటు వివాదం కూడా కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.