హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాయిరెడ్డి రిమాండ్ పొడగింపు: సిబిఐ ముందు ఐఏఎస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Vijayasai Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను హైదరాబాదులోని నాంపల్లి కోర్టు వచ్చే నెల 5వ తేదీ వరకు పొడగించింది. విజయ సాయి రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను కూడా వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది. విజయసాయి రెడ్డిని మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. విజయసాయి రెడ్డి జైలులో ల్యాప్‌టాప్ వాడకానికి అనుమతి కోరుతూ పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఐఎఎస్ అధికారి పార్థసారథి మంగళవారం సిబిఐ ముందు హాజరయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జగన్‌కు చెందిన సాక్షి దినపత్రికకు ఇచ్చిన వాణిజ్య ప్రకటనలపై సిబిఐ ఆరా తీస్తోంది. ఈ విషయాలను రాబట్టడానికే పార్థసారథిని సిబిఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పార్థసారథి సమాచార కమిషనర్‌గా పనిచేశారు. ఇదిలావుంటే, గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చార్జిషీట్ దాఖలుకు సిబిఐ మరింత గడువు కోరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

English summary
Vijayasai Reddy, arrested in YS jagan assets case, judicial remand extended till March 5.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X