వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలితకు చిక్కులు: సుప్రీంకోర్టు నోటీసు జారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayalalitha
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చిక్కుల్లో పడ్డారు. సుప్రీంకోర్టు మంగళవారం జయలలితకు నోటీసు జారీ చేసింది. 1992లో రూ. 2 కోట్ల రూపాయల విలువ గిఫ్ట్ కేసు ప్రొసిడింగ్స్‌ను కొట్టేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సిబిఐ సుప్రీంకోర్టు సవాల్ చేసింది. సిబిఐ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం జయలలితకు ఆ నోటీసు జారీ చేసింది.

నాలుగు వారాల్లోగా తమ నోటీసుకు వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు జయలలితను ఆదేశించింది. జయలలిత తన జన్మదిన వేడుకల సందర్భంగా అందుకున్న 89 డిమాండ్ డ్రాఫ్ట్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దాఖలు చేయడంలో ఏ విధమైన జాప్యం చేయలేదంటూ సిబిఐ హైకోర్టు తీర్పును సవాల్ చేసింది. చార్జిషీట్ దాఖలులో జాప్యం చేశారంటూ ఎఫ్ఐఆర్, చార్జిషీట్లను హైకోర్టు కొట్టేయడం సరి కాదని సిబిఐ తరఫున సుప్రీంకోర్టులో వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ హరీన్ రావల్ అన్నారు.

English summary
Chief Minister of Tamil Nadu, Jayalalitha has been issued a notice by the Supreme Court on Tuesday, Feb 21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X