జగన్ ఆస్తుల కేసు: సిబిఐ కస్టడీ పిటిషన్ కొట్టివేత

వైయస్ జగన్ ఆస్తుల కేసులో లీజుల విషయంలో రాజగోపాల్‌ను, శ్రీలక్ష్మిని విచారించాల్సిన అవసరం ఉందని, వారి విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని సిబిఐ తన పిటిషన్‌లో తెలిపింది. గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో నిందితులైన ఆ ఇద్దరు అధికారుల పాత్ర వైయస్ జగన్ ఆస్తుల కేసులోనూ ఉన్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని సిబిఐ అభిప్రాయపడింది.
ఇరువైపులా వాదనలు విన్న నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగమారుతీ శర్మ అస్పష్టంగా ఉన్న మెమోపై కోర్టు ఏ విధమైన ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు. అస్పష్టంగా ఉన్న మెమో ఆధారంగా దాఖలైన కేసును మూసివేస్తున్నట్లు ప్రకటించారు.