జగన్ కేసు: 7 గంటలపాటు నిమ్మగడ్డ ప్రసాద్ విచారణ

ఓబుళాపురం గనుల కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్‌లకు బుధవారంతో రిమాండ్ ముగిసింది. దీంతో సిబిఐ ప్రత్యేక కోర్టు వారిని వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది. మార్చి 7వ తేది వరకు వారి రిమాండును పొడిగించింది. తమ కార్లు, హెలికాప్టర్లు తిరిగి అప్పగించాలన్న గాలి, శ్రీనివాస్ రెడ్డి పిటిషన్లపై విచారణను కోర్టు 28వ తేదికి వాయిదా వేసింది. ఓఎంసి కేసులోనే అరెస్టైన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి రిమాండును కూడా కోర్టు మార్చి ఏడవ తేది వరకు పొడిగించింది. ఎమ్మార్ కేసులో అరెస్టైన బిపి ఆచార్య, సునీల్ రెడ్డి, కోనేరు ప్రసాద్, విజయ రాఘవన్‌ల రిమాండ్ కోర్టు రెండు వారాలు పొడిగించింది.












Click it and Unblock the Notifications