రామోజీ రంకెలేలా అంటూ జగన్ సాక్షి డైలీ ప్రశ్న

Sakshi Logo
హైదరాబాద్: రాష్ట్రంలో రెండు పత్రికల అధినేతల మధ్య సమరం సాగుతూనే ఉన్నది. ఈనాడు దినపత్రిక అధినేత రామోజీ రావుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి డైలీ దుమ్మెత్తిపోసింది. రామోజీ.. రంకెలేలా అనే శీర్షికతో సాక్షి దినపత్రిక గురువారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. సాక్షి దినపత్రికకు ప్రభుత్వం ఇచ్చిన వాణిజ్య ప్రకటనలపై ఈనాడు పత్రిక రాసిన ఓ వార్తాకథనాన్ని ప్రశ్నిస్తూ సాక్షి దినపత్రిక ఈ వార్తాకథనాన్ని ప్రచురించింది. ప్రభుత్వం తమకు ఎక్కువ వాణిజ్య ప్రకటనలు ఇవ్వడాన్ని సమర్థించుకుంటూ సాక్షి ఈ వార్తాకథనాన్ని ప్రచురించింది.

పిడబ్ల్యూసీ ఆడిట్ ప్రకారం ఆదిలోనే సాక్షి సర్క్యులేషన్ 12.73 లక్షలని, నాటికి ఎబిసి ప్రకారం ఈనాడు విక్రయించే కాపీల సంఖ్య 11 లక్షలని, 2008 -09 ఆర్ఎన్ఐ ప్రకారం కూడా సాక్షి సర్క్యులేషన్ 12.83 లక్షలని, అప్పట్లో సాక్షి కన్నా ఈనాడు యాడ్ రేట్లు 20 శాతం ఎక్కువని, ఆదివారాల్లో అయితే యాడ్ రేట్లు సాక్షి కన్నా ఏకంగా 40 శాతం అధికమని, ఎక్కువ ప్రతులు, తక్కువ ధర కావడంతో ప్రభుత్వం సాక్షి వైపు మొగ్గు చూపి వాణిజ్య ప్రకటనలు ఇచ్చిందని వివరించింది.

తమకు ఇచ్చిన ప్రకటనలను ఈనాడు దినపత్రికకు ఇస్తే మరో 20 కోట్ల రూపాయలు అదనంగా వదిలేవని, దాన్ని సవాల్ చేస్తూ ఎవరైనా కోర్టుకెళ్తే అధికారుల ఉద్యోగాలు పోయేవని, నిబంధనల మినహాయింపులో వార్త, ఆంధ్రజ్యోతి, సూర్య తర్వాతే సాక్షి వార్తకు, ఆంధ్రజ్యోతికి మినహాయింపు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సిబిఐ ఎందుకు పిలువడం లేదని సాక్షి దినపత్రిక అన్నది.

సాక్షికి ప్రకటనలు ఇవ్వడానికి ఏకంగా ప్రత్యేకంగా జీవో విడుదల చేశారని రామోజీ రాసిన రాతల్లో నిస్పృహ, సాక్షిపై పెంచుకున్న కసి, వాస్తవాలను విస్మరించే దివాళాకోరుతనం, నచ్చనివారిపై దగుల్బాజీ తనం తప్ప ఇంకేమీ కనిపించవని సాక్షి వార్తాకథనం వ్యాఖ్యానించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+