హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం ముడుపులపై సభలో మంత్రి కన్నా ప్రకటన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Muddukrishnama Naidu-Kanna Laxminarayana
హైదరాబాద్: మద్యం ముడుపులపై మంత్రి కన్నా లక్ష్మి నారాయణ శుక్రవారం సభలో ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఎసిబి 350 సిండికేట్ల దుకాణాలపై మాత్రమే దాడులు జరిపిందన్నారు. 34 సిండికేట్లపై దాడులు జరిగాయన్నారు. ఎసిబి నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందన్నారు. తూర్పు గోదావరి, గుంటూరు, విశాఖపట్నం, ఖమ్మం, వరంగల్, శ్రీకాకుళం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో ఎసిబి దాడులు నిర్వహించిందన్నారు. త్వరలో ఎక్సైజ్ విధానంలో మార్పులు చేస్తామని చెప్పారు. ఆధారాలు దొరికిన చోట అరెస్టులు చేశామన్నారు. అరెస్టులు చేసిన వారిలో 24 మంది బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టి వేసిందన్నారు. సిండికేట్ మెంబర్లపైన ఎసిబి దృష్టి సారించిందని తెలిపారు. కేసును నీరుగార్చే విధంగా సభ్యులు మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు. లంచాలు తీసుకొని ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన అధికారులను సస్పెండ్ చేశామన్నారు. విచారణ పూర్తయిన తర్వాత దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

మద్యం సిండికేట్లతో అధికారులు కుమ్మక్కయ్యారని అధారాలు ఉన్నాయన్నారు. మద్యాన్ని ఎమ్మార్పీకి అమ్మడం వల్లే ప్రభుత్వంపై కక్ష కట్టారన్నారు. టిడిపి హయాంలో మద్యం ఆదాయానికి భారీగా గండి పడిందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త రమణతో ఓ పథకం ప్రకారం మంత్రులపై ఆరోపణలు అన్నారు. ఓ క్రిమినల్ చెప్పిన మాటలు నమ్మి టిడిపి సభలో రాద్దాంతం చేయడం తగదన్నారు. రమణది క్రిమినల్ చరిత్ర అన్నారు. ఆయన వాంగ్మూలాన్ని సీరియస్‌గా తీసుకోవద్దన్నారు. కన్నా మాట్లాడుతుండగా టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అడ్డు తగిలి మంత్రి ప్రకటనలో ఎలాంటి వివరాలు లేవన్నారు. ఎసిబి రిపోర్టును అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు. రిమాండు రిపోర్టులో ఓ మంత్రి పేరు ఉందని డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారని తెలిపారు. ఆ మంత్రి పేరు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. మా వద్ద ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు.

English summary
Liquor issue created very heat in Assembly today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X