శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యాఖ్యల హీట్: జగన్‌కు కృష్ణ దాస్ ఝలక్ ఇస్తారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-Dharmana Krishan Das
శ్రీకాకుళం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యుడు ధర్మాన కృష్ణదాసు గురువారం చేసిన వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కృష్ణ దాస్ మనసు మార్చుకొని జగన్ వర్గం నుంచి తిరిగి సొంతగూటికి చేరుతారని జరుగుతున్న ప్రచారానికి ఈ ప్రకటన ఊతమిస్తోందని అంటున్నారట. అదే జరిగితే జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కష్టమేనని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు అంటున్నారని తెలుస్తోంది. వైఎస్ జగన్ పార్టీ పెట్టిన తర్వాత టెక్కలి, నరసన్నపేట ఎమ్మెల్యేలు కొర్ల భారతి, ధర్మాన కృష్ణదాస్‌లు ఆయనకు జైకొట్టి ఆ పార్టీకి మద్దతిస్తూ వచ్చారు. ఆ క్రమంలో రెండు నెలల కిందట టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని స్పష్టం చేస్తూ, జగన్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. నరసన్నపేట ఎమ్మెల్యే కృష్ణ దాస్ మాత్రం జగన్ విధేయుడిగానే ఉన్నారు. ఇటీవల శాసనసభలో తెలుగు దేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు కూడా వేశారు కూడా. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తమ రాజీనామా ఆమోదించవద్దని విశాఖపట్నం వచ్చిన స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కృష్ణదాస్ వ్యక్తిగతంగా కలిసి అభ్యర్థించారట.

నరసన్నపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా మంజూరయ్యే అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఆయన ప్రమేయం లేకుండానే కొనసాగుతున్నాయి. ఆయననే నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఈ పరిస్థితే తీవ్ర అసంతృప్తికి కారణమయిందని అంటున్నారు. అటు తమ నాయకుడిని కాదని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేక, ఇటు సంక్షేమ పథకాలకు తమవారిని లబ్ధిదారులుగా సూచించే అవకాశం లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మంత్రి ధర్మాన వచ్చే అవకాశాలు లేవని, కానీ కృష్ణ దాస్ మాత్రం కాంగ్రెస్‌లోకి చేరే పరిస్థితులే ఎక్కువగా కన్పిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, కృష్ణ దాస్ సతీమణి ధర్మాన పద్మప్రియ వద్ద ప్రస్తావిస్తే అది వాస్తవం కాదని, ఆయన పార్టీ నుంచి వెళ్లరని స్పష్టం చేశారట. కాగా గురువారం కృష్ణదాస్ మాట్లాడుతూ తాను కాంగ్రెసులోకి వెళ్లవచ్చు లేదా తన సోదరుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి రావొచ్చు.. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చునని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

English summary
YSR Congress Party camp leader Dharmana Krishna Das statement created heat in Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X