వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్ల సూరీడు నెల్సన్ మండేలా ఆరోగ్యం ఆందోళనకరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nelson Mandela
జోహెన్నెస్‌బర్గ్: నల్ల సూరీడు నెల్సన్ మండేలా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉదర సంబంధ వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో జోహెన్నెస్‌బర్గ్‌లోని ఒక ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు. ఆయన వయస్సు 93 ఏళ్లు. వర్ణ వివక్షపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు ఆయన. ఆయనను ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వరించింది.

నల్లజాతీయుల హక్కుల ఉద్యమంలో ఇరవయ్యేడేళ్లు ఆయన జైలు శిక్ష అనుభవించారు. 1990లో ఆయన జైలు నుండి విడుదలయ్యారు. 1993లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1994లో ఆయన దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడిగా పదవి వరించిన తొలి నల్లజాతీయుడు మండేలా. మండేలా త్వరగా కోలుకోవాలని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్ జుమా ఆకాంక్షించారు.

English summary
Former South Africa President Nelson Mandela has been taken to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X