వైయస్ జగన్ రాజ్యసభ ఎన్నికల వ్యూహం రెడీ

తమ పార్టీ తరఫున అభ్యర్థిని దింపి, మరింత మంది కాంగ్రెసు శాసనసభ్యుల మద్దతు కూడగట్టే ఆలోచన ఓ వైపు సాగుతుండగా, మరో పార్టీ అభ్యర్థికి మద్దతిచ్చే విషయం కూడా ఇంకో వైపు సాగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజ్యసభ బరిలో అభ్యర్థిని పెడితే బలపరచాలనే ఆలోచన కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెరాసకు 13 మంది శానససభ్యులున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు వచ్చే నెల నోటిఫికేషన్ వెలువడనుంది. జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై ఈ నోటిఫికేషన్ వెలువడే లోగానే అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది జరగకపోతే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వేటు వేయడానికి వీలు కాదు. మొత్తం, వైయస్ జగన్ పార్టీలో రాజ్యసభ ఎన్నికలపై తీవ్రంగానే ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications