హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్, బాలకృష్ణలే అధ్యక్షువులవుతారు: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Balakrishna and Jr Ntr
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్ లేదా బాలకృష్ణ అయ్యే అవకాశం ఉంటుంది గానీ తెలంగాణ ప్రాంత నేత కావడానికి అవకాశం ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలుగుదేశం పక్కా ఆంధ్ర పార్టీ అని, ఇందులో సందేహం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం తెలంగాణకు చెందిన మోత్కుపల్లి నర్సింహులుకో, ఎర్రబెల్లి దయాకర్ రావుకో వస్తుందా అని ఆయన అడిగారు. తెలంగాణవారికి ఆ అవకాశం రాదని, ఎన్టీఆర్‌కో బాలకృష్ణకో వస్తుందని ఆయన అన్నారు.

పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబే ఉన్నారని, వీటిలో ఓ పదవిని తెలంగాణవారికి ఇవ్వవచ్చు కదా, కానీ ఇవ్వరని ఆయన అన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టానని చంద్రబాబు అనడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తాము బిక్షగాళ్లం, మీరు బిక్షం వేసేవారా అని ఆయన అడిగారు. తెలంగాణవారిని బిక్షగాళ్ల మాదిరిగానే చంద్రబాబు చూస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు, సిపిఐ, బిజెపిలో పార్టీ అధ్యక్షులుగా తెలంగాణ నేతలు ఉన్నారని, వాటిలో అవకాశం ఉందని, తెలుగుదేశం పార్టీలో తెలంగాణవాళ్లు పార్టీ అధ్యక్షులు కావడం ఈ జన్మలో కుదరదని ఆయన అన్నారు.

తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేతలు తెలంగాణ బానిసల ఫోరం పెట్టుకోవాలని ఆయన అన్నారు. నాయకులకు స్వేచ్ఛ ఇచ్చానని చంద్రబాబు అంటున్నారని, రాజ్యాంగపరంగా స్వేచ్ఛ ఉందని, అలా ఉన్నప్పుడు తాను స్వేచ్ఛనిచ్చానని చెప్పడం చంద్రబాబు ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనమని ఆయన అన్నారు. కోవూరులో తాము పోటీ చేయడం ఖాయమని, రేపు అభ్యర్థిని ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. కోవూరు నియోజకవర్గంలో తాను ప్రచారం చేస్తానని, అక్కడ చంద్రబాబు బాగోతాలు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాను రోడ్డు మార్గం ద్వారానే కోవూరు వెళ్తానని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తినే కోవూరు అభ్యర్థిగా ఖరారు చేస్తామని, పార్టీ ఇంచార్జీలను కూడా నియమిస్తామని ఆయన చెప్పారు.

English summary
TRS president K Chandrasekhar Rao said that Balakrishna or Jr NTR will get chance to takeup party president post, Telangana leader will not get.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X