మాకు కెసిఆర్ మద్దతు: ప్రత్యేకాంధ్ర ఉద్యమ నేతలు

"ప్రత్యేకాంధ్ర కావాలని పె ద్ద సంఖ్యలో ప్రజలు కోరుకుంటున్నారు. కానీ, కొందరు నేతలు దీన్ని అడ్డుకుంటున్నా రు. అందుకే కేసీఆర్‌ను కలిశాం. కోవూరు ఉప ఎన్నికల్లో పోటీ పెట్టాలని కోరాం. ఆయన సానుకూలంగా స్పందించారు'' అని చెప్పారు. అవసరమైతే ప్రచారానికి కూడా వస్తామని చెప్పినట్లు తెలిపారు. సీమాంధ్రలో టీఆర్ఎస్ పోటీ వార్తలను మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొట్టి పారేశారు. అదంతా కేసీఆర్ ప్రచార జిమ్మిక్కు అని పేర్కొన్నారు. కోవూరు ఉప ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి తరఫున పొర్లు మధుయాదవ్‌ను పోటీలో నిలిపేందుకు నిర్ణయించారు. దానిని సోమవారం అధికారికంగా ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications