జగన్ వర్గ ఎమ్మెల్యేలపై త్వరలో వేటు: సిఎం సంకేతం

Kiran Kumar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన తమ కాంగ్రెసు పార్టీ శానససభ్యులపై త్వరలో అనర్హత వేటు పడుతుందని ముఖ్యమంత్రి సంకేతాలు ఇచ్చారు. త్వరలో రాష్ట్రంలోని 24 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని ఆయన శానససభలో అన్నారు. దీన్ని బట్టి జగన్ వర్గం శాసనసభ్యులపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి, జగన్ వర్గానికి చెందిన 16 మంది కాంగ్రెసు శాసనసభ్యుల భవిష్యత్తును, ఓ ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యురాలి భవిష్యత్తును స్పీకర్ తేల్చాల్సి ఉంది.

పోలవరం టెండర్లపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ - త్వరలో 24 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని, ఆ ఉప ఎన్నికల్లో ఎవరు ఏమిటో తెలుస్తుందని తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామని ఆయన చెప్పారు. అనవసరంగా తమపై బురద చల్లవద్దని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు.

ఏడు స్థానాలకు మార్చి 18వ తేదీన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రెండో విడత ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి వీలుగా వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై చర్యలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పావులు కదిపే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు లోకసభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డిని స్పీకర్ మీరా కుమార్ ఆమోదించిన నేపథ్యంలో జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై వేటుకు మరింత జాప్యం జరిగే అవకాశాలు లేవని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+