వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిపిఐ నిర్ణయం: బాబుకు చేయి, కెసిఆర్‌కు చేయూత

By Pratap
|
Google Oneindia TeluguNews

KCR-Narayana-Babu
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో సిపిఐ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో మాత్రం సిపిఎంకు మద్దతివ్వాలని సిపిఐ నిర్ణయించింది. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గం బుధవారం సమావేశమై నిర్ణయం తీసుకుంది. సిపిఐ మద్దతు కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పోటీ పడిన విషయం తెలిసిందే. ఈ స్థితిలో సిపిఐ చంద్రబాబుకు మొండిచేయి చూపి, కెసిఆర్‌కు చేయూత అందిస్తోంది. తెలంగాణవాదానికి ఉప ఎన్నికల్లో తాము మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేసి తిరిగి పోటీ చేస్తున్నవారికి తాము మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు.

తాము తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని, అందువల్ల తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వలేమని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వలేకపోవడం కొంత బాధాకరమేనని ఆయన అన్నారు. తెరాసతో అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ తెలంగాణవాదాన్ని బలోపేతం చేయడానికి తాము తెరాస అభ్యర్థులను బలపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. తెరాస అంటరాని పార్టీ ఏమీ కాదని, అందువల్ల ఆ పార్టీ అభ్యర్థులకు మద్దతిస్తున్నామని ఆయన అన్నారు. వామపక్షాల ఐక్యత కన్నా తమ పార్టీ ఉనికి ముఖ్యమని, అందువల్ల తెలంగాణలో తెరాస అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. వామపక్షాల ఐక్యత కోసం కోవూరులో సిపిఎం అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.

English summary
CPI executive committee has decided to support TRS in bypolls in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X