వైవాహికేతర సంబంధమే ఆమె హత్యకు కారణమా?

స్నేహ్లా హత్యకు జహీదా కాంట్రాక్టు కిల్లర్లను కిరాయికి తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. స్నేహ్లాకు తన భర్తతో అక్రమ సంబంధం ఉందనే ఆగ్రహంతో ఆమె అందుకు కిరాయి హంతకులను పురికొల్పినట్లు చెబుతున్నారు. సిబిఐ అధికారులు జహీదాను మంగళవారం విచారించారు. ఆ తర్వాత ఆమెను అరెస్టు చేశారు. కిరాయి హంతకులకు జహీదా 3 లక్షల రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. స్నేహ్లా 2011 ఆగస్టులో హత్యకు గురైంది.
స్నేహ్లా హత్య కేసులో మరిన్ని అరెస్టులు జరుగుతాయని సిబిఐ అధికారులు అంటున్నారు. ఓ బిజెపి ఎమ్మెల్యేలను కూడా అరెస్టు చేసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఆ ఎమ్మెల్యే ఎవరనేది తెలియడం లేదు. జహీదాతో పాటు మరో ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications