సత్యమేవ జయతే..: బెంగళూర్‌కు గాలి తరలింపు

గాలి జనార్దన్ రెడ్డి భారీ భద్రత మధ్య వాహనంలో రోడ్డు మార్గం ద్వారా బెంగళూర్ తరలించారు. తనను తరలించే సమయంలో కూడా రోడ్డు మార్గం ద్వారా తీసుకుని వెళ్తే తన ప్రాణాలకు ముప్పు ఉందని, హైలికాప్టర్‌లో గానీ విమానంలో గానీ తీసుకుని వెళ్లాలని ఆయన జైలు అధికారులతో, సిబిఐ అధికారులతో అన్నారు. ఆయన మాటలను అధికారులు పట్టించుకోలేదు.
అంతకు ముందు - తనను హెలికాప్టర్‌లో లేదా విమానంలో బెంగళూర్ తరలించాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. గాలి జనార్దన్ రెడ్డిని నిబంధనల మేరకు, చట్టప్రకారం బెంగళూర్ తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రోడ్డు మార్గం ద్వారా గాలి జనార్దన్ రెడ్డిని బెంగళూర్ తరలించారు. గురువారం సాయంత్రం గాలి జనార్దన్ రెడ్డిని వాహనంలో తీసుకుని అధికారులు బెంగళూర్ ప్రయాణమయ్యారు. రేపు శుక్రవారం ఉదయం ఆయనను బెంగళూర్ కోర్టులో హాజరు పరుస్తారు.












Click it and Unblock the Notifications