వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్ఆర్ మేనేజర్ హత్య: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Techie Commits Suicide
గుర్గావ్: ఓ ప్రైవేట్ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ హత్య కేసు మిస్టరీని గుర్గావ్ పోలీసులు ఛేదించారు. రెండు రోజుల క్రితం హెచఆర్ మేనేజర్ మృతదేహాన్ని పోలీసులు కనిపెట్టారు. అతని మృతదేహంపై 26 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ కేసులో పోలీసులు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అరెస్టు చేశారు. అతన్ని మధురకు చెందిన ప్రశాంత్ తోమార్‌గా గుర్తించారు. కారులో లిఫ్ట్ ఇచ్చి ప్రయాణికులను దోచుకునే ముఠాకు ప్రశాంత్ నేతృత్వం వహిస్తున్నట్లు పోలీసులు కనిపెట్టారు. గతంలో కూడా ఈ ముఠా ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసింది.

పాతికేళ్ల హతుడు పాట్నాకు చెందిన పరమానంద్ ఫిబ్రవరి 25వ తేదీన ఇఫ్కో చౌక్ వద్ద సాఫ్ట్‌వేర్ ముఠా పికప్ చేసుకుంది. లుక్ష్మి ఎంటర్‌ప్రైజెస్‌ అనే సెక్యూరిటీ ఏజెన్సీలో పరమానంద హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఢిల్లీలో ప్లాట్ చూడాలని వెళ్లేందుకు ఇఫ్కో చౌక్ వద్ద నించున్నాడు. అతని వద్ద 50 వేల రూపాయలున్నాయి. అతని ముందు హుందాయ్ ఇయోన్ కారు ఆగింది. ఢిల్లీకి తీసుకుని వెళ్తామని కారులో ఉన్నవారు చెప్పారు. నలుగురు వ్యక్తులు అప్పటికే కారులో ఉన్నారు. కారులో కూర్చుని కొంత దూరం ప్రయాణించిన తర్వాత మాత్రమే అతనికి వారిపై అనుమానం వచ్చింది.

ఆ రోజు రాత్రి ఎనిమిదిన్న గంటల ప్రాంతంలో బిలాస్‌పూర్ వద్ద ముఠా పరమానందను దోచుకుని కిందికి తోసేయడానికి ప్రయత్నించింది. అతడు ప్రతిఘటించాడు. దాంతో దుండగులు అతన్ని కత్తులతో పొడిచి చంపేశారు. హత్య తర్వాత రింగ్ లీడర్ ప్రశాంత్ ఢిల్లీకి పారిపోయాడు. విపరీతంగా మద్యం సేవించి ఎయిమ్స్‌లో చేరాడు. అయితే, కారులో రక్తంతో తడిసిన కత్తిని పోలీసులు కనిపెట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రశాంత్ నేరాన్ని అంగీకరించాడు.

English summary
The Gurgaon police claimed to have solved the murder case of an HR manager with a private firm whose body was found with 26 stab wounds, a couple of days ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X