బాలుడి వేళ్లు నమిలిన మహిళ: జైలులో సంఘటన

బర్ఫీపై జైలు అధికారులు సివిల్ లైన్స్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసి, బాధితులను జెఎల్ఎన్ ఆస్పత్రికి తరలించారు. భోజన విరామ సమయంలో సల్మా తన ఆహారాన్ని తీసుకోవడానికి వెళ్లినప్పుడు ఆమె కుమారుడు అర్మాన్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో బర్ఫీ అర్మాన్‌పై దాడి చేసింది. బర్ఫీ తన కుమారుడిని చూసి కొట్టడం ప్రారంభించిందని, ఆ తర్వాత అతని వేళ్లను నమిలిందని సల్మా చెప్పింది.
బర్ఫీ తనపై దాడి చేయడంతో అర్మాన్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. అప్పటి నుంచి అతని నోట మాట రావడం లేదు. నెల రోజుల క్రితం బర్ఫీ జైపూర్, అజ్మీర్ మధ్య తన కుమారుడిని రైలు నుంచి తోసేసింది. పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టిన తర్వాత ఓ మూల గంటల విచారంగా కూర్చుంటూ ఉండేది. అర్మాన్‌ను చూస్తే మండిపోయేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications