కెఏ పాల్‌తో విభేదాల్లేవు, సువార్త ప్రసంగాలే: బ్ర.అనిల్

కాగా బ్రదర్ అనిల్ కుమార్ సువార్త సభల్లో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ వర్గాన్ని పూర్తిగా తన బావమరిది జగన్ వైపు మరల్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకు సువార్త సభలను ఆయన వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. యేసు క్రీస్తు నామం జపించాల్సిన చోట అంతకంటే ఎక్కువంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నామస్మరణం చేస్తున్నారనే వాదనలు వినిపించాయి. ఎక్కడ ఏసుక్రీస్తు సభలు జరిగినా అనిల్ వైయస్సార్ పేరును ప్రస్తావిస్తూ దేవుని వ్యాఖ్యంలో రాజకీయ డైలాగులు చెబుతున్నారనే విమర్శలు వచ్చాయి. ఇటీవల గోదావరి జిల్లాలోని అమలాపురంలో సువార్ సభలో అనిల్ తో పాటు ఆయన భార్య షర్మిళ కూడా పాల్లొన్నారట. అక్కడ అనిల్ మాట్లాడుతూ.. అద్వితీయమైన కుమారుడిని ఇచ్చారంటూ పరోక్షంగా వైయస్సార్, జగన్‌లను ఉద్దేశించి ప్రస్తావించారని వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications