మీరింకా స్టూడెంట్స్: సభలో కాంగ్రెస్ నేతలకు బాబు క్లాస్

Chandrababu Naidu
హైదరాబాద్: మీరింకా స్టూడెంట్స్ అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం శాసనసభలో కాంగ్రెసు నేతలకు క్లాస్ పీకారు. ఉపాధి హామీ పథకం అవకతవకలపై శాసనసభ దద్దరిల్లింది. ఉపాధి హామీ పనుల్లో ఎలాంటి ఫలితాలు కనబడటం లేదని చంద్రబాబు విమర్శించారు. గ్రామ సభలు పెట్టకుండానే నామినేషన్లపై పనులు ఎలా కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. ఈ పనుల్లో ఏమాత్రం పారదర్శకత లేదని విమర్శించారు. ఉపాధి హామీ పనులపై జిల్లా స్థాయిలో అంబుడ్స్‌మన్ ఏర్పాటు చేయాలని, విచారణకు సభా సంఘం వేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనుల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ పనుల్లో పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని దుయ్యబట్టారు.

తెలుగుదేశం పార్టీ పాలనను ప్రశ్నించే అర్హత కాంగ్రెసు పార్టీకి లేదన్నారు. ఏడేళ్లలో రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నారన్నారు. ఉపాధి హామీ అవకతవకలపై సభా సంఘం వేసేంత వరకూ తమ ఆందోళన కొనసాగిస్తామన్నారు. తమ అక్రమాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం సభ నుంచి వాయిదా పేరుతో పారిపోతుందన్నారు. ఓ సమయంలో బాబు మాట్లాడతూ.. మీరింకా స్టూడెంట్స్ అని మీకు పాలన తెలియదన్నారు. కాగా పనుల పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని సిపిఎం సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+