తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రచారానికి చిరంజీవి రెడీ

చిరంజీవి కోవూరులోనే కాకుండా తెలంగాణ నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయడానికి సుముఖంగానే ఉన్నట్లు చెబుతున్నారు. సమైక్యాంధ్ర నినాదం పుచ్చుకుని సీమాంధ్రలో పర్యటించిన తర్వాత చిరంజీవి తెలంగాణలో పర్యటించలేదు. ఒక రకంగా చెప్పాలంటే, చిరంజీవి తెలంగాణలో అడుగు పెట్టడానికి జంకినట్లే కనిపించారు. ఇప్పుడు కాంగ్రెసు కార్యకర్తల అండదండలతో, అభిమానుల తోడుతో ఆయన తెలంగాణలో పర్యటించడానికి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు.
తాను సమైక్య నినాదం పుచ్చుకున్నప్పటికీ తెలంగాణలో తనకు అభిమానులు పెద్ద యెత్తునే ఉన్నారని చిరంజీవి భావిస్తున్నారు. వారంతా తన వెంటే ఉంటారని కూడా ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలకు, ఆ అభిమానానికి లంకె కుదురుతుందా అనేది అనుమానంగా ఉంది. తెలంగాణలోని ఆరు శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఆరు నియోజకవర్గాల్లోనూ చిరంజీవి ప్రచారం కార్యక్రమం ఉంటుందా, లేదా అనేది రేపు తేలనుంది.












Click it and Unblock the Notifications