బస్సు ప్రయాణంతో అలసిపోయిన గాలి, స్వల్పఅస్వస్థత

కాగా గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులో అరెస్టైన తర్వాత తొలిసారి కర్నాటకకు వెళ్లారు. దీంతో అతనిని చూడటానికి భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. గాలిని ఉంచిన పోలీసు స్టేషన్ ప్రాంగణం అంతా గాలి అభిమానులతో నిండిపోయింది. అతనికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఎప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడు చూద్దామా అన్న ఆతృత వారిలో కనిపించింది. భారీగా జనాలు తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా గాలిని కోర్టుకు తరలిస్తున్న సమయంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కవరేజ్ చేస్తున్న మీడియాపై న్యాయవాదులు దాడి చేయడంతో ఐదుగురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications