విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవసరమైతే జూ.ఎన్టీఆరొస్తారు, బాలయ్యపైనా: హరికృష్ణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hari Krishna
విజయవాడ: పార్టీకి అవసరమైనప్పుడు హీరో జూనియర్ ఎన్టీఆర్‌ సేవలు తాము వినియోగించుకుంటామని తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ ఆదివారం కృష్ణా జిల్లా విజయవాడలో అన్నారు. తాను కాని తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ తెలుగుదేశం పార్టీకి దూరం కాలేదన్నారు. తాను క్రియాశీలకంగా ఉన్నానని, జూ.ఎన్టీఆర్ పార్టీకి అవసరమైనప్పుడు వస్తాడని అన్నారు. నారా - నందమూరి కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన చెప్పారు. గతంలో తన సోదరుడు, హీరో బాలకృష్ణ పైనా వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చాయన్నారు. పార్టీ కోసం అందరం కలసి కట్టుగా పని చేస్తామని చెప్పారు. మా కుటుంబంలో మూడో తరానికి చెందిన జూ.ఎన్టీఆర్‌ను కూడా ప్రజలు ఆదరించి అభిమానిస్తున్నారన్నారు. యువత తెలుగుదేశం పార్టీని అర్థం చేసుకోలేక పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అర్థం చేసుకొని టిడిపికి ఓటు వేసి ఉంటే రాష్ట్రంలో దుష్ట కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువకిరణాలను నమ్మేదెవరని ప్రశ్నించారు.

కాంగ్రెసు పార్టీ అందిన కాడికి దోచుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సమర్థ పాలన ఉంటుందని తద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెసు పాలన కారణంగా రాష్ట్రం దౌర్భాగ్య స్థితిలో ఉందన్నారు. రైతులను, మహిళలను ఈ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీయేనన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుతో తెలంగాణ అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. ఎన్టీఆర్ రక్తం పంచుకొని పుట్టిన ప్రతి ఒక్కరూ టిడిపి అభివృద్ధికే కృషి చేస్తారన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని చెప్పారు. కాగా ఎడ్లబండిలో ప్రయాణించి హరికృష్ణ హల్ చల్ చేశారు. హరికృష్ణ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు అందరూ పాల్గొన్నారు.

English summary
TDP leader Harikrishna said that he has no differences with party chief Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X