హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెప్పినందుకు థ్యాంక్స్: ఈనాడు కథనంపై బొత్స కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: మాకు కేవలం పదకొండు మద్యం షాపులే ఉన్నాయని తేల్చినందుకు ధన్యవాదాలు అని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం ఈనాడు కథనంపై కౌంటర్ ఇచ్చారు. ఆయన కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తన వారికి మద్యం దుకాణాలు ఉన్నాయని తాను గతంలోనే చెప్పానని, ఇప్పుడు కొత్తగా చేసిన ఆరోపణలు ఏమీ లేవని బొత్స అన్నారు. తన వారికి పదకొండు మద్యం దుకాణాలు మాత్రమే ఉన్నాయని చెప్పినందుకు కృతజ్ఞతలు అన్నారు. నేను ప్రకటించిన అంశాలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆయన అన్నారు. న్యాయబద్దంగా మద్యం వ్యాపారం చేయమని తన వారికి ఎప్పుడో సూచించానని అన్నారు. ఉప ఎన్నికలు జరగనున్న ఏడు నియోజకవర్గాలకు మండలవాల వారీగా ఎమ్మెల్యేలను ఇంచార్జులుగా నియమించినట్లు చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం తాజా మాజీ ఎమ్మెల్యేల స్థానాలలో మంత్రులు, ఎంపీలను ఇంచార్జులుగా త్వరలో నియమిస్తామని చెప్పారు.

ఆర్టీసిని శాశ్వతంగా ప్రైవేటీకరణ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. కొత్త రూట్లలో ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఆర్టీసిని వికేంద్రీకరించి జోన్‌లను పటిష్టం చేస్తామని చెప్పారు. జోన్‌ల వారీగా టార్గెట్లు పెడతామని చెప్పారు. కాగా ఆర్టీసిని ప్రైవేటీకరణ చేయాలనుకుంటుందన్న బొత్స వ్యాఖ్యలపై లెఫ్ట్ పార్టీలు మండిపడ్డాయి. ఆర్టీసిని ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన మానుకోవాలని సూచించారు.

English summary
PCC chief Botsa Satyanarayana said thanks for revealing his relatives liquor shops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X