కెసిఆర్‌కు చివరివి, సిఎంతో జగన్ కుమ్మక్కు: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు ఇవే చివరి ఎన్నికలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కుమ్మక్కయ్యారని, ఈ విషయం కోవూరులో తేటతెల్లమవుతుందని ఆయన అన్నారు.

శాసనసభను సరిగా నడపడం లేదంటూ చంద్రబాబు నాయుడు స్పీకర్ నాదెండ్ల మనోహర్‌పై మండిపడ్డారు. సభను నడపాల్సిన బాధ్యత స్పీకర్‌ది, ప్రభుత్వానిది అని, ప్రభుత్వం సహకరించకపోతే సభను నడపడానికి అవసరమైన చర్యలను స్పీకర్ తీసుకోవాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శాసనసభ నడుస్తున్న తీరు బాధాకరంగా ఉందని ఆయన అన్నారు.

సకల జనుల సమ్మె విరమణ సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా, లేదా అనే విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా సమాధానం చెప్పలేదని, దాన్ని అడగడానికి ప్రయత్నిస్తే స్పీకర్ సభను వాయిదా వేశారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని ఆయన అడిగారు. ఉద్యమాల సందర్భంగా సీమాంధ్ర, తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని తాము అడిగామని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన అన్నారు.

సభలో చాలా సమస్యలపై చర్చ జరగాల్సి ఉందని, సభ సరిగా జరగకపోతే ప్రజల్లో చులకన అవుతామని ఆయన అన్నారు. కరవు ప్యాకేజీ ఇప్పటి వరకు రాలేదని ఆయన అన్నారు. 610 జీవో అమలుకు కమిటీ ఎందుకు వేయలేదని ఆయన అడిగారు. తాము లేవెనత్తే సమస్యలకు సమాధానం చెప్పలేకనే ప్రభుత్వం సభను వాయిదా వేయించుకుంటోందని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+