హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏ సిన్మా ఏ థియేటర్లోనో, చిరు ఎక్కడున్నా అంతే: సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ఉప ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ఏ సినిమా ఏ థియేటర్లో ఆడుతుందో చెప్పలేం కదా అని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వం పని తీరుకు రెఫరెండం కాదన్నారు. ప్రస్తుత ఉప ఎన్నికలకు స్థానిక కారణాలు కారణం అవుతున్నాయన్నారు. స్థానిక కారణాలతో జరుగుతున్నందున రెఫరెండం అనలేమన్నారు. టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదటిసారి రెండు లక్షల మెజార్టీతో గెలిచారని, ఆ తర్వాత పదిహేను వేల మెజార్టీతో మాత్రమే గెలిచారని, ఉప ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకున్న సీట్లను సాధారణ ఎన్నికల్లో మేం గెలుచుకున్నామని దానిని ఆయన రెఫరెండం అనగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల లోపే ఉప ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన లేదన్నారు. ఫలితాల ప్రభావం ప్రభుత్వంపై ఉండదన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.

17 స్థానాల ఉప ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఈసి చూసుకుంటుందని చెప్పారు. మా వాళ్లు నాపై చేసే కామెంట్లకు తాను స్పందించనని అన్నారు. పార్టీ అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇస్తే వారే ఆయా నియోజకవర్గాలలో పోటీ చేస్తారని అన్నారు. నాయకుల ప్రచారం పిసిసి నిర్ణయిస్తుందని అన్నారు. జివికేకు రాజ్యసభ సీటు అని చూసి ఆశ్చర్య పోయానన్నారు. తిరుపతి శాసనసభ్యుడి చిరంజీవి రాష్ట్రంలో ఉన్నా, కేంద్రంలో ఉన్నా లాభమేనన్నారు. కొందరు కొన్ని చోట్ల ఉంటే లాభం కానీ చిరంజీవి ఎక్కడున్నా పార్టీకి లాభమేనన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో సిబిఐ తన పని తాను చేసుకు పోతోందన్నారు. రేషన్ కార్డుల స్థానంలో త్వరలో స్మార్ట్ కార్డులు ఇస్తామని సిఎం చెప్పారు. నెలాఖరులోగా ఆధార్ కార్డులు ఇస్తామని చెప్పారు.

English summary
CM Kiran Kumar Reddy responded on bypolls today. He said bypolls are not referendum to government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X