హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త పద్ధతుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు: సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: సకల జనుల సమ్మె సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలకు కొంత సమయం పట్టే అవకాశముందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం అసెంబ్లీలో చెప్పారు. తమ పార్టీ నేతలు, విపక్షాల సూచనల మేరకు ఇప్పటికే 177 జివోను నిలిపి వేశామని చెప్పారు. ఉద్యోగుల హామీల అంశం హైకోర్టులో ఉందని, హైకోర్టు నుండి ఈ విషయమై అనుమతి వచ్చాక హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఉద్యోగులు కొత్త కొత్త పద్దతుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారన్నారు. కాగా బిజెపి, తెలంగాణ టిడిపి నేతలు ఉద్యోగుల హామీలపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ పోడియం వద్దకు వెళ్లారు. స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. అంతకుముందు సభ రెండుసార్లు పదిహేను నిమిషాల చొప్పున వాయిదా పడింది.

సభను నిత్యం వాయిదా వేయడాన్ని తప్పు పడుతూ తెలుగుదేశం పార్టీ నేతలు స్పీకర్ చాంబర్ వద్ద ఆందోళన నిర్వహించారు. స్పీకర్ నిరంకుశ ధోరణితో సభను ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. సకల జనుల సమ్మె సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం మోసం చేసిందని ఎర్రబెల్లి దయాకర రావు ఆరోపించారు. 177 జివోను రద్దు చేయమంటే కోర్టు పరిధిలో ఉందని చెప్పి సిఎం చేతులెత్తేశారన్నారు. ఉద్యోగుల హామీలు ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. సిఎం బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సమ్మె సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. కాగా స్పీకర్ చాంబర్ వద్ద టిడిపి నేతలు ధర్నా చేస్తూ లోనికి వెళ్లే ప్రయత్నాలు చేశారు. సిబ్బంది వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న స్పీకర్ వారిని లోనికి పిలిచి మాట్లాడారు. జివోపై ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుదామని సూచించారు.

English summary
CM Kiran Kumar Reddy said that promises of government in the time of Sakala Janula Strike will take some time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X