హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ అరెస్ట్ ఖాయం, కెవిపి ఎందుకు అరెస్ట్ కాలేదో: జెసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయక తప్పదని అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సోమవారం అన్నట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం జెసి టిడిఎల్పీ గదికి వచ్చారు. ఆయన టిడిపి నేతలు మోత్కుపల్లి నర్సింహులు, పయ్యావుల కేశవ్‌తో పిచ్చాపాటిగా మాట్లాడారు. జగన్‌ను అరెస్టు చేయడం తప్పదని, అయితే అది కొవ్వూరు ఎన్నికలకు ముందా లేక తర్వాత అన్న దానిపై స్పష్టత లేదని చెప్పారు. ప్రభుత్వ మాజీ సలహాదారు కెవిపి రామచంద్ర రావును ఎందుకు అరెస్టు చేయడం లేదన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును మీరు బాగా ఇరుకున పెడుతున్నారని మోత్కుపల్లికి జెసి కితాబిచ్చారు. మీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన దానికి ఇప్పుడు మేం ఫలితం అనుభవిస్తున్నామని వారితో అన్నారు. అధికారులు అవినీతి విషయంలో బాగా బరి తెగించారని అరోపించారు. కాగా కెసిఆర్‌కు వ్యతిరేకంగా తాను చేపట్టబోయే పాదయాత్ర వివరాలను మోత్కుపల్లి ఆయనకు వివరించారు.

కాగా సోమవారం అసెంబ్లీ ప్రారంభమైన పది నిమిషాలకే వాయిదా పడింది. సకల జనుల సమ్మె సమయంలో ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఓ సమయంలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టింది. విపక్షాలు కూడా వివిధ అంశాలపై పట్టుబట్టాయి. దీంతో స్పీకర్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. కాగా అనంతరం జెసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు.

English summary
Anantapur senior Congress MLA JC Diwakar Reddy said that YSR Congress Party chief YS Jaganmohan Reddy will arrest soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X